బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూలై 26

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నాయకులు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

శనివారం నాడు నగారం మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లరాళ్ల అఖిలాష్ రెడ్డి, దమ్మాయిగూడ మునిసిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కందడి శ్రవణ్ రెడ్డి, మెడ్చల్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ బర్లపాటి అరవింద్, మరియు పలువురు యువజన కార్యకర్తలు కలిసి కీసర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

పోలీస్ స్టేషన్ సీఐ కె. శ్రీనివాస్ మరియు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి ఈ ఫిర్యాదును స్వీకరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను కించపరిచే విధంగా ఉన్నాయని, దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ నేతలు కోరారు.

Join WhatsApp

Join Now