నిజాంసాగర్‌లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మరియు రాఖీ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు

నిజాంసాగర్‌లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మరియు రాఖీ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ( ప్రశ్న ఆయుధం)ఆగస్టు 09

ఈరోజు నిజాంసాగర్ మండలంలోని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సూచనల మేరకు,
తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అలాగే జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రోజ్ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం మరియు రాఖీ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా భారత్ కి బేటియోం కే భాయ్ – నారి సురక్ష కా రక్షక్ రాహుల్ భయ్యాఅనే భావంతో, తెలంగాణ మహిళలు, విద్యార్థులు మరియు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి వంటి పథకాల లబ్ధిదారుల చేతితో తయారు చేసిన ప్రత్యేక రాఖీలను సేకరించి, నిజాంసాగర్ మండలంలోని ఆడపిల్లల ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా నేరుగా ఢిల్లీలోని రాహుల్ గాంధీకి పంపడం జరిగింది.ఈ మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రోజ్ మరియు నిజాంసాగర్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాము రాథోడ్ ప్రత్యేకంగా పాల్గొని, యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఆయనతో పాటు నిజాంసాగర్ మండలం యువ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ, రాఖీ కట్టే కార్యక్రమం, మహిళా సురక్ష, యువత హక్కులు, రాహుల్ గాంధీ పట్ల ప్రేమాభిమానాలు చాటుతూ నినాదాలు చేశారు
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ యువజన కాంగ్రెస్, మహిళా భద్రత, విద్య, సంక్షేమ పథకాల ప్రాధాన్యతను మరొకసారి స్పష్టంగా ప్రజలకు తెలియజేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment