*మున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన యువజన కాంగ్రెస్ నాయకులు*
*స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి మంచినీటి ఎద్దడి నివారణకు కృషి చేయాలి*
జమ్మికుంట మే 7 ప్రశ్న ఆయుధం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్నుల వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచినందుకుగాను అందుకు కృషి చేసిన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండి అయాజ్ ను యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు పింగళి చైతన్య రమేష్, దొడ్డి సంధ్య నవీన్ లు బుధవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు అనంతరం యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పింగిలి చైతన్య రమేష్ మాట్లాడుతూ ఆస్తి పన్నుల వసూళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచినందుగాను తెలంగాణ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి మూడు కోట్ల నిధులను జమ్మికుంట మున్సిపాలిటీకి మంజూరు చేసినందుకు జమ్మికుంట ప్రాంతానికి చెందిన యువతి యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు జమ్మికుంట గ్రంథాలయంలో సరైన వసతులు లేక కరీంనగర్ హన్మకొండ వరంగల్ హైదరాబాద్ వెళ్లి చదువుకోవాల్సి వస్తుందనీ అన్నారు. దీనివల్ల నిరుద్యోగుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడడమే కాకుండా చదివించే స్తోమత లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామనే మానసిక ఇబ్బంది నుండి తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కలుగుతుందని ఆవేదనను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు కుంగిపోతున్నారనీ తెలిపారు నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చగల గ్రంథాలయంలో 15 లక్షల విలువ గల పుస్తకాలతో పాటు త్రాగునీటి వసతి కుర్చీలు బాత్రూంలు సమకూర్చాలని అలాగే జమ్మికుంట పట్టణ జనాభా పెరుగుదల దృష్ట్యా మంచినీటి ఎద్దడి ఒక లక్ష యాభై వేల లీటర్ల సౌకర్యం గల మంచినీళ్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ మహమ్మద్ సజ్జత్ అలీ, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు గోస్కుల నాగమణి, ప్రధాన కార్యదర్శి అజయ్, కార్యదర్శులు గొడుగు మానస, రోమాల రాజకుమార్, పాతకాల రమేష్,మండల అధ్యక్షుడు బొడిగె శ్రీకాంత్, ఉపాధ్యక్షులు వినయ్, శ్యామ్, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, మహేష్, కార్యదర్శులు రవి, అజయ్, 15వ వార్డు అధ్యక్షులు మైస సురేష్, 22వ వార్డ్ అధ్యక్షులు మలుగూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.