*నరేంద్ర మోది దిష్టి బొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
*హుజురాబాద్ మే 18 ప్రశ్న ఆయుధం*
లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు ఎంపీరాహుల్ గాంధీ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని మోడీ సర్కార్ బీహార్ రాష్ట్రం దర్భంగాలో అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులను రాహుల్ గాంధీని కలవనీయకుండా కేంద్ర పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నందున బిజెపి ప్రభుత్వ నియంత పరిపాలనకు నిరసనగా హుజురాబాద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఉపాధ్యక్షులు పంజాల అరవింద్ చల్లూరి విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున నియోజకవర్గంలోని హుజురాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ లో నరేంద్ర మోడీ దిష్టి దహనం చేశారు అనంతరం చల్లూరి విష్ణువర్ధన్ పంజాల అరవింద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కి ప్రజల్లో వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేని మోడీ సర్కార్ రాహుల్ గాంధీ పర్యటనలను అడ్డుకోవడం సిగ్గు చేటు అన్నారు బిజెపి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన రాహుల్ గాంధీకి దేశ ప్రజల్లో ఉన్న ఆదరణను పోగొట్టలేవని స్పష్టం చేశారు త్వరలోనే మతతత్వ బిజెపి పార్టీకి దేశ ప్రజలు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ హుజురాబాద్ మండల అద్యక్షులు పంజాల అరవింద్ ఉపాధ్యక్షులు చల్లూరి విష్ణువర్ధన్, సందీప్, అరుణ్, అసెంబ్లీ కార్యదర్శి చిట్యాల రేవంత్, కార్యదర్శి పంజాల రాజు, మరియు , యువజన కాంగ్రెస్ నాయకులు త్రినేష్,
సాయి, బన్నీ, సాయి, రవితేజ, బన్నీ, రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు