ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నాయకులు

*ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నాయకులు*

*IMG 20250325 WA0065

పక్షాన నిలబడి ఉపాధి కల్పించాలని డిమాండ్*

*మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్*

*జమ్మికుంట మార్చి 25 ప్రశ్న ఆయుధం*

ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు చేపట్టిన “సంసద్ ఘోరావ్ పార్లమెంట్ ముట్టడి” కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల నాయకులు పాల్గొన్నారు మంగళవారం రోజున ఢిల్లీ జంతర్ మంతర్ లో మార్చ్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నిరుద్యోగుల పక్షాన ఉద్యోగం ఇవ్వండి కానీ సంకెళ్ళు కాదు అంటూ నినాదాలు ఇచ్చి పార్లమెంటు ను ముట్టడి చేశారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం నియంతృత్వం పరిపాలనకు వ్యతిరేకంగా, అన్ని రాష్ట్రాల నుండి యూత్ కాంగ్రెస్ నాయకులు వేలాదిగా తరలి వెళ్లి ధర్నా నిర్వహించారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మత్తుకు బానిసలుగా మార్చి నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుద్దొని హెచ్చరించారు బీజేపీ నియంతృత్వ పోకడలకి నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ఇంచార్జి కృష్ణా అల్ల వారు ఆదేశాల మేరకి తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సురభి త్రివేది ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగిన “సంసద్ ఘోరావ్” పార్లమెంట్ ను ముట్టడి చేసి యువజన కాంగ్రెస్ ఐక్యతను చాటారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ వెంట ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, కార్తీక్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now