యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి కి ఘన సన్మానం 

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి కి ఘన సన్మానం

గజ్వేల్ నియోజకవర్గం, 19 ఫిబ్రవరి 2025 :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుధవారం కాంగ్రెస్ నాయకుడు సమీర్, కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం సమీర్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఆంక్ష రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని ఆంక్ష రెడ్డి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూతురుగా తండ్రికి తగ్గ తనయగా ప్రజల్లో మంచి ఆదరణ పొందాలని, స్వశక్తితో రాజకీయాల్లో రాణిస్తూ, యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికవ్వడం అభినందనీయమని, వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నదని అన్నారు.

Join WhatsApp

Join Now