Site icon PRASHNA AYUDHAM

పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా ఖండించిన యూత్ కాంగ్రెస్

IMG 20250423 WA2841

*పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా ఖండించిన యూత్ కాంగ్రెస్*

*భద్రతా వైఫల్యానికి కేంద్రం బాధ్యత వహించాలి*

*యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాసపల్లి సాగర్*

*జమ్మికుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఈ దాడిలో 25 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదకర ఘటనపై యువజన కాంగ్రెస్ తీవ్రంగా స్పందించిందని పేర్కొన్నారు జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాచపల్లి సాగర్ మాట్లాడుతూ

ఈ దాడి మానవత్వాన్ని మంటగలిపిందని కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులపై జరిగిన ఈ కిరాతక చర్య మానవతా విలువలపై దాడిగా చూడాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది మోడీ ప్రభుత్వ నిఘా వ్యవస్థ వైఫల్యానికి జీవంత సాక్ష్యమని కేంద్ర ప్రభుత్వం భద్రతా విభాగాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ప్రజల భద్రతపై ప్రభుత్వం నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఉందని సూచించారు హుజురాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తరఫున, బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.

Exit mobile version