*యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి…*
– యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు మట్టు రవికుమార్
*నిర్మల్ జిల్లా కుబీర్ ( లోకేశ్వరం) డిసెంబర్ 29 (ప్రశ్న ఆయుధం ):*
యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని యువ నాయకుడు మట్టు రవికుమార్ పేర్కొన్నారు. ఆయన స్వగ్రామమైన కుబీర్ మండలంలోని చొండి గ్రామంలో యువకులకు ఆదివారం క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నేటి యువతే దేశానికి దిక్సూచీ అని, ప్రతీ ఒక్కరూ సన్మార్గంలో పయనించాలన్నారు. గంజాయి, మద్యం, జూదం లాంటి వాటికి దూరంగా ఉండాలని, కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇటీవలే యువకులకు బాస్కెట్ బాల్ మరియు నెట్ బహుకరించడంతోపాటు ఇప్పుడు క్రికెట్ కిట్లు అందజేసి యువకులను ప్రోత్సహిస్తూ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు రవికుమార్ను గ్రామస్తులు, యువకులు అభినందించారు.