స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

గజ్వేల్ బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్

గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, 12 జనవరి 2025 : విశ్వవేదికపై భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను చాటిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద స్ఫూర్తితో భారతీయ యువత ముందుకు సాగాలని గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ అశోక్ గౌడ్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వివేకానంద మహనీయుడికి శతకోటి వందనాలు అర్పించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. యువతీ యువకులు అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు, స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు దేవులపల్లి మనోహర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి, సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేష్, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివకుమార్, లీగల్ సెల్ కన్వీనర్ శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ‌, మండల ఉపాధ్యక్షులు నాయిని సందీప్, మైస విజయ్, బారు అరవింద్, నాయకులు గణపతి, సుమతి, మమత, వనజ, స్వామి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now