బస్సు అగ్ని ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత డప్పు రాజు దిగ్భ్రాంతి

బస్సు అగ్ని ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత డప్పు రాజు దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా చిన్నటేకూర్ సమీపంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం పై తీవ్ర స్పందన

ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం

గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని విజ్ఞప్తి

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలంటూ పిలుపు

సంఘటనపై విచారణ జరిపి నిర్లక్ష్యం జరిగితే చర్యలు తీసుకోవాలని సూచన

కర్నూలు జిల్లా చిన్నటేకూర్ గ్రామం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ రాష్ట్ర నాయకులు డప్పు రాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణ వైద్యం, అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇలాంటి విషాద ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డప్పు రాజు సూచించారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment