వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముఖ్య సమావేశం..
స్థానిక 1 టౌన్ లోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోమవారం నాడు మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశం లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 55వ డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు
*మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్.*
పశ్చిమ నియోజకవర్గంలో గత ఐదు నెలల నుంచి ఒక్క అభివృద్ధి పని జరగలేదు
కూటమి ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గనికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి..?
మేము అభివృద్ధి చేసిన స్టేడియంలో పూర్తిగా నాశనం చేశారు.వాకింగ్ ట్రాక్ లేకుండా చేయటం దారుణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళంగానే స్టేడియానికి నిధులు మంజూరు చేశారు. పశ్చిమ నియోజకవర్గ స్టేడియాన్ని నిర్వియోగం చేశారు
పశ్చిమ నియోజకవర్గం సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విఫలమయ్యారు.
వారానికి ఒకరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి విజిట్ చేస్తారు
కానూరు వెళ్లి ప్రజలు సమస్యలు విన్నవించుకోవాలి.
ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పశ్చిమ నియోజకవర్గం. పశ్చిమ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వానికి ఒక్క నాయకుడు లేడు ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి చోటామోటా నాయకులు అందరూ వసూళ్లు పై దృష్టి పెట్టారు దయచేసి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండండి
పశ్చిమ నియోజకవర్గానికి ఎలాగో నిధులు కేటాయించలేరు కాబట్టి పేద ప్రజలను ఆదుకోండి
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముఖ్య సమావేశం..
by kana bai
Published On: November 11, 2024 11:39 pm