సంగారెడ్డి ప్రతినిధి, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు. బుధవారం ఎంపీ సురేష్ శెట్కర్ అధ్యక్షతన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించేందుకు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సహ అధ్యక్షులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ముఖ్య అతిథులుగా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, విద్యా, ఆరోగ్య రంగాల్లో జరుగుతున్న పనులపై చర్చ జరిగింది. అధికారులచే సమర్పించబడిన వివరాల ఆధారంగా, సమస్యాత్మక అంశాలు గుర్తించబడి వాటి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 165 నేషనల్ హైవే పనులు వెంటనే పూర్తి చేసేలా నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని, వచ్చే సమావేశానికి నేషనల్ హైవే అధికారులు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పటాన్ చెరు, జహీరాబాద్ నేషనల్ హైవేలో మల్కాపూర్ వద్ద, నాందేడ్ అకోలా రహదారిలో సుల్తాన్ పూర్ వద్ద సంపూర్తిగా ఉన్న పనులు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో విద్య, వైద్య,గృహ,ఆరోగ్య శాఖల అధికారులను జిల్లాలో జరుగు తున్న ఆయా శాఖల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించడం కోసం ఉన్న భవనాన్ని కూల్చివేశారని భవన నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు చెట్లకుంద చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు వెంటనే పాఠశాల భవనం నిర్మించేలా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చెరువులు కుంటలలో మత్స్యశాఖ ద్వారా చేపల పెంపకానికి అవసరమైన చేప పిల్లల్ని జిల్లాలోని ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రోడ్లు భవనాల నిర్మాణంలో గల ఆలస్యానికి కారణాలు అడిగారు. వైద్య ఆరోగ్యం విషయంలో ఎలాంటి విధానాల అవలంబిస్తున్న ప్రజల కావలసిన అవసరాలను వివరించారు. జిల్లాలో గల క్రీడా మైదానాల పని తీరును క్రీడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్రీడాపథకాల అమలులో పారదర్శకత, సమర్థత, వేగం పెంచాలని ఎంపీ సురేష్ శెట్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు అనిత చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు. అన్ని శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయ, సంక్షేమ, గ్రామీణ శాఖలో గల పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో జిల్లాకు కావలసిన అవసరాలను వివరించారు. దేశాభివృద్ధిలో గ్రామాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలకు కలిపే లింక్ రోడ్డు పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాయన్నారు. అనంతరం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రజలకు ఏ అవసరాలు ఉన్న ప్రభుత్వాలు తీరుస్తున్నట్లు ఆమె వివరించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే చేరాలని అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. నాయకులు అధికారుల సమన్వయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తక్షణం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పిడి డిఆర్ డిఏ జ్యోతి, దిశ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజల అభివృద్దే మా లక్ష్యం: జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్
Published On: May 7, 2025 8:05 pm