జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట్ స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట్ స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం

అందరు హాజరు కావాలని పూర్వ విద్యార్థి డి. ఎల్. యన్. చారి పిలుపు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నందిపేట్ ఐదు దశాబ్దాల గౌరవార్థం స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 19వ తేదీ, ఆదివారం జరగనుంది. 1974-2024 మధ్యకాలంలో చదివిన పూర్వ విద్యార్థులు అందరూ ఈ ప్రత్యేక సందర్భానికి హాజరు కావాలని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్.ఎన్. చారి పిలుపునిచ్చారు.

ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సహా ప్రముఖులు, అతిరథ మహారథులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థుల అందరూ సహకరించాలని డి.ఎల్.ఎన్. చారి అభ్యర్థించారు.

Join WhatsApp

Join Now