మెదక్/గజ్వేల్, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వల్లాల శ్రీనివాస్ తన కృషి, క్రమ శిక్షణతో హైదరాబాద్ జోన్‌లో ఉత్తమ కండక్టర్‌గా ఎంపికయ్యారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షాహ్ ఖాన్ చేతుల మీదుగా కండక్టర్ శ్రీనివాస్ కు జోనల్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది శ్రీనివాస్‌ను అభినందించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ అవార్డు మరింత బాధ్యతను కల్పించిందని, ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలను అందిస్తూ, సంస్థ ప్రతిష్టను నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. గజ్వేల్ డీఎం పావన్, ఆర్టీసీ సీఐ బాబునాయక్, తోటి ఉద్యోగులు అభినందించారు.
గజ్వేల్ డిపో కండక్టర్ శ్రీనివాస్‌కు జోనల్ అవార్డు
Oplus_131072