*ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా తరలి వెళ్లిన మండల కాంగ్రెస్ శ్రేణులు*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 4 ప్రశ్న ఆయుధం*
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఇల్లందకుంట మండల కేంద్రం నుండి తరలి వెళ్లారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ నేతృత్వంలో నియోజకవర్గంలో నుండి వివిధ మండలాల నుండి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ఆపై నాయకులు భారీ మొత్తంలో తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే హాజరై కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజ పరచడం భవిష్యత్తులో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అధికారం చేపట్టేందుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి దిశా నిర్దేశం చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ పేర్కొన్నారు
బీజేపీ పాలనలో దేశం ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందని బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు హక్కులు కోల్పోతున్నారని, బీజేపీ చెర నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యమాన్ని తీసుకొని గ్రామ గ్రామానా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ముందుకు పోతుందని తెలిపారు బీజేపీ రాజ్యంగా వ్యతిరేక నిర్ణయాలు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఇల్లందకుంట మండల గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు