*విద్యార్థులకు మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్*
*జమ్మికుంట ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్ పి టి ఎస్) ఆధ్వర్యంలో
మంగళవారం మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ 2024- 25 జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు జిల్లా స్థాయికి ఏం పిక్ కావడం జరిగిందని తెలిపారు జెడ్ పి హెచ్ ఎస్ కొత్తపల్లి నుండి బి అమర్నాథ్ ప్రధమ స్థానంలో జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ జమ్మికుంట నుండి జే ఆశ్లేష, జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపల్లి నుండి ఎం రాహుల్ కేజీబీవీ జమ్మికుంట నుండి పి శివ సాయి హర్షిత ద్వితీయ స్థానంలో నిలిచారు. జెడ్పిహెచ్ఎస్ కోరపల్లి నుండి జీ స్పందన కేజీబీవీ జమ్మికుంట నుండి టి సుప్రజ తృతీయ స్థానంలో నిలిచారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు ఈనెల 11న జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమలో మండల విద్యాధికారి హేమలత, జెడ్పిహెచ్ఎస్ బాలురు జమ్మికుంట ప్రధానోపాధ్యాయులు ఎన్. సదానందం ఎఫ్ పి ఎస్ టి జిల్లా సెక్రెటరీ దేవదాసు మండల ఎఫ్.పి.ఎస్.టి బాధ్యులు ఏం. స్వామి, వి. స్రవంతి,ఏం. సంతోష్ కుమార్ మండల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు సురేఖ, స్రవంతి, బాలమణి, జయలక్ష్మి, కృష్ణమూర్తి, సతీష్ భాస్కర్ రెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.