మండల స్థాయి ప్రాథమిక పాఠశాల  ప్రజ్ఞోత్సవాలు….

*మండల స్థాయి ప్రాథమిక పాఠశాల

ప్రజ్ఞోత్సవాలు….

ప్రశ్న ఆయుధం న్యూస్ 25 మార్చ్ కామారెడ్డి జిల్లా గాంధారి

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండల

కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో వివిధ పాఠశాల లకు చెందిన విద్యార్థులతో ప్రజ్ఞోత్సవాలు 2025 లో భాగంగా మంగళవారం మండల స్థాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రజ్ఞోత్సవాలు కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యాధికారి శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ వివిధ పాఠశాల నుండి వ్యాసరచన పోటీల్లో భాగంగా పాఠశాల పరిశుభ్రత ఆరోగ్యం అంశాలపై వ్యాసరచన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అంతేకాకుండా లిఖిత పోటీలను ముఖాముఖి పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. గెలుపొందిన 16 మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ బహుమతులతో సర్టిఫికెట్ను మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధారి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రంగ వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రంగారావు, కుమారస్వామి, పిఆర్జియు మండల అధ్యక్షుడు ప్రకాష్, తపస్ మండల ప్రధాన కార్యదర్శి స్వామి, వివిధ పాఠశాల చెందిన ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now