*గవరంపేటలో ప్రకృతి వ్యవసాయం: పరిశీలించిన మండలం వ్యవసాయ అధికారి*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
గవరంపేట గ్రామం లో మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్న రైతుల పొలాలు పరిశీలనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వేరుశెనగ, నువ్వులు పంటలను పరిశీలించారు, ఆ పంటలలో వేసుకున్నటువంటి అంతర పంటలను ఆకుకూరలు, మొక్కజొన్న, తీగజాతి పంటలను గమనించారు, ప్రతీ రైతు కూడా ప్రధాన పంట తో పాటు అంతరపంటలు వేసుకోవటం వలన అదనపు ఆదాయం వస్తుంది భూమిలో జీవ వైవిద్యం పెరుగుతుందని తెలిపారు, APCNF సిబ్బంది బి.ధనుంజయ్, మరియు VAA k. సోనియా హాజరు అయ్యారు