*ఎస్ జి ఎఫ్ మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీలు*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11*
విద్యార్థులకు మండల స్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలు అండర్ 14 అండర్ 17 బాల బాలికలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిచేడు క్రీడా ప్రాంగణంలో 12 సెప్టెంబర్ గురువారం రోజున ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు ప్రతి పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు చొప్పున హాజరుకావాలని మండల విద్యాధికారి కోమ్మెర శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ క్రీడలలో అండర్ 14 అండర్ 17 బాల బాలికలకు 100 మీటర్ల పరుగు పందెం షార్ట్ పుట్ డిస్కస్ త్రో లాంగ్ జంప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు