బీసీ వసతి గృహంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

 

ఏ బి సి డబ్ల్యూ ఓ — విజయలక్ష్మి ప్రారంభించారు.

బీసీ బాలుర వసతి గృహంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జిల్లా అధికారి డి బి సి డి ఓ ఇందిరా ఆదేశాల మేరకు భద్రాచలం మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం అయ్యాయి, ఈ ప్రారంభానికి ఏ బి సి డబ్ల్యూ విజయలక్ష్మి కబడ్డీ పోటీలను ప్రారంభించి ఈ ఆటలు పోటీలు విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఈ ఆటలతో పాటు చదువుల్లో కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించాలని మంచిగా చదువుకొని పాఠశాలకు వసతి గృహానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రత్యతలు తీసుకురావాలని కోరారు. ఈ ఆటలు ప్రశాంతమైన వాతావరణంలో బీసీ వసతి గృహంలో ఘనంగా జరిగాయి ఈ ఆటల పోటీలు రెండు రోజులపాటు కోకో, వాలీబాల్, రన్నింగ్ ఆటలు పోటీలు కూడా జరుగుతాయని విజయలక్ష్మి తెలిపారు. ఈ ఆటలు పోటీలలో పాల్గొన్నవారు హై స్కూల్ ప్రధానోపాధ్యారాలు పద్మజ, వసతి గృహ అధికారి నరసింహారావు, టీచర్స్, పిటి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now