నర్సాపూర్‌లో ఘనంగా ఉపాధ్యాయ, ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు

నర్సాపూర్, సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఇంజనీరింగ్ దినోత్సవం వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు, ఇంజనీర్లకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫాస్ట్ డ్రిస్టిక్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నర్సాపూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు అధ్యక్షుడు మణికొండ రాఘవేందర్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి శ్రమ ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఇంజనీర్లు దేశ అభివృద్ధికి వెన్నెముకలుగా నిలుస్తూ సాంకేతిక రంగంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు చేసి సమాజానికి సేవలందిస్తున్నారని అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు ఉపాధ్యాయులు, ఇంజనీర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, డిస్టిక్ ట్రెజరర్ డాక్టర్ నరసింహారెడ్డి, ఫాస్ట్ ప్రసిడెంట్ జైపాల్, సెక్రటరీ అశోక్, ట్రెజరర్ వెంకటస్వామిగౌడ్, సభ్యులు నరేందర్, కిష్టయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment