సైబర్ వలలో ₹1.08, 816.లక్షల మోసం

సైబర్ వలలో ₹1.08, 816.లక్షల మోసం

గాంధారి మండలం గండివేట తాండా యువకుడి ఖాతా నుంచి సొమ్ము లూటీ

వాట్సాప్‌లో పెట్టుబడులు పెట్టమని ఆకర్షణ

ఫేక్ లింక్ ఓపెన్ చేయడంతో ఖాతా ఖాళీ

వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు

“అపరిచిత లింకులు క్లిక్ చేయొద్దు” – ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరిక

ప్రశ్న ఆయుధం ,గాంధారి, ఆగస్టు 8: గాంధారి మండలం గండివేట తాండాకు చెందిన సభావాత్ అనిల్‌కు వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి లింక్ పంపాడు. ఆ లింక్ ఓపెన్ చేసి, సూచించినట్లుగా ఇన్వెస్ట్ చేయడంతో, అనిల్ ఖాతా నుంచి ₹1,08,816 సైబర్ మోసగాళ్లు లూటీ చేశారు. విషయం గ్రహించిన అనిల్ 1930కు కాల్ చేసి, గాంధారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చిన లింకులు, ఫేక్ యాప్‌లు ఓపెన్ చేయొద్దని గాంధారి ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment