సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం ళడ్డేన్న గూడెం తండా గ్రామ పంచాయతీ, కోయలగూడ తండాకు చెందిన భదావత్ మాలిని అధికారులు పాఠశాలలో చేర్పించారు. శుక్రవారం అనాధ గిరిజన శుక్రవారం బాలిక మాలిని పరిస్థితి గురించి వడ్డన్న గూడెం పాఠశాల ఉపాధ్యాయురాలు జోత్స్న, పద్మావతి, విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది డిన్యాయవాది అంజయ్యలు మాట్లాడుతూ.. జిల్లా అధికారులకు అనాధ గిరిజన బాలిక మాలిని పరిస్థితి గురించి వివరించినట్లు చెప్పారు. కే.జీ.బీ.వీ. పాఠశాల, గురుకుల పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి కంది మండలంలోని కాసింపూర్ లోని కస్తూర్బా బాలిక పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించి వసతి, దుస్తులు, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందజేశారని అన్నారు. మాలిని తన భవిష్యత్తు గురించి తెలుపుతూ పెద్దయ్యాక డాక్టరై పేద ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష అధికారులు సునీత కన్నా, మాధవి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు శ్రావణ్ గౌడ్, సబితా, కంది మండల విద్యాధికారి జోగప్ప, కే.జీ.బీ.వీ. పాఠశాల ప్రత్యేక అధికారి రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
అనాధ గిరిజన బాలికను కేజీబీవీ పాఠశాలలో చేర్పించిన అధికారులు: విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది డి.అంజయ్య
Published On: October 10, 2025 2:57 pm