సంగారెడ్డి, అక్టోబర్ 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణం నుండి శబరిమల పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి భక్తులు ప్రతి సంవత్సరం భక్తి పూర్వకంగా పాదయాత్ర చేసి సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నారని ప్రశంసించారు. భక్తుల సేవ చేయడం తనకు ఆనందంగా ఉందని, భక్తి మార్గంలో సమాజం ఏకతాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములకు పొన్న శంకర్ రెడ్డి లక్ష రూపాయల విరాళం
Published On: October 6, 2025 8:00 pm