సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): అలయ్ బలయ్ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అన్నారు. శనివారం జోగిపేటలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలయ్ బలయ్ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, దసరా పండుగ ధర్మం మీద అధర్మం గెలుపుని సూచిస్తుందని అన్నారు. అలయ్ బలయ్ వంటి వేడుకలు మత, కుల, రాజకీయ భేదాలను పక్కనపెట్టి మానవ సంబంధాలను బలపరుస్తాయని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ఈ సంప్రదాయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం అని, ప్రజల మధ్య స్నేహం, పరస్పర గౌరవం పెంపొందించడం మా ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టిజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును శాలువాతో సన్మానించారు. బీబీ పాటిల్ జర్నలిస్టుల పట్ల చూపుతున్న మద్దతును ఆయన ప్రశంసించారు. జిల్లా బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక కళాకారులు, జర్నలిస్టులు పాల్గొని ఉత్సవ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.
అలయ్ బలయ్ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు
Published On: October 5, 2025 7:57 pm