సంగారెడ్డి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులోని క్రికెట్ మైదానంలో జరిగిన అంబేద్కర్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల ఆట తీరును అభినందిస్తూ, విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన గేమ్ చేంజర్ టీం విజతలుగా నిలిచారు. వారికి రూ. 33వేల నగదు ట్రోపి అందజేశారు. రన్నరప్ గా ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన అంబేద్కర్ టీం నిలిచింది. వారికి రూ. 22 వేల నగదు ట్రోపి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమ శిక్షణ, జట్టు స్పూర్తి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని తెలిపారు. యువత తమ ప్రతిభను చూపేందుకు ఇలాంటి టోర్నమెంట్లు వేదికగా నిలుస్తాయని, క్రీడలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా విజేత జట్టుకు ట్రోఫీ అందజేయడంతో క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో నిర్వాహకులు కృషి చేయడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, నాయకులు చింతా సాయినాథ్, నారాయణ, వెంకటేష్, శ్రీనివాస్ మహిపాల్, ఎస్. వెంకటేష్, మల్లేశం తదితరులు ఉన్నారు.
ఇంద్రకరణ్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంటు.. విజేతలకు ట్రోపీ బహుకరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
Published On: October 21, 2025 7:45 pm