సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇంద్రేశ్వరం ఉప మండలం పరిధిలో పద సంచలనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిటిజన్ కాలనీ నుంచి ఆర్కే నగర్, ఇంద్రేశం వరకు స్వయం సేవకులు శోభాయాత్రగా ర్యాలీగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై, గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా స్వయం సేవకులు దేశభక్తి నినాదాలు చేస్తూ ప్రజల్లో దేశసేవా స్పూర్తిని కలిగించారు. స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శతాబ్ది ఉత్సవాల భాగంగా ప్రతి గ్రామంలో సంఘ సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య ర్యాలీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.