సంగారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమ్మేళనం (అలయ్ బలయ్) కార్యక్రమం ఈ నెల 6న ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి చౌరస్తా విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ మూడులో గల విద్యానగర్ కమ్యూనిటీ హాల్ లో దసరా పండుగ పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో లింగాయత్ బంధుమిత్రులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ధనంజయ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర స్వామి, ఉప కోశాధికారి శివకుమార్, కార్యదర్శులు శరణు బసవేశ్వర్, శివ కుమార్, గౌలీశ్వర్, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు వీరమనమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 6న వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆత్మీయ సమ్మేళనం
Published On: October 5, 2025 6:46 pm