ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని ఐటీఐ సమీపంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏటీసీ సెంటర్ లో కొనసాగుతున్న బోధన విధానం, విద్యార్థులకు అందిస్తున్న సాంకేతిక శిక్షణను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. నేటి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఏటీసీలో అమలవుతున్న కోర్సులు, అధునాతన మిషనరీలు, అభివృద్ధి పనులపై వివరాలను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఏటీసీ ద్వారా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment