ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుడి అంత్యక్రియలు

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): డబ్బు ఉన్నవాడు సేవ చేయడం ఒక సాధారణ గుణం, సేవ చేయాలనే మనసు ఉండడం అత్యున్నతమైన మహాగుణం అని, ఆ మహాగుణానికి నిజమైన ప్రతిరూపం మాదిరి పృథ్వీరాజ్ నిలుస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఉన్న మదర్ మేరీ ఓల్డ్ ఏజ్ హోంలో సుమారు పది సంవత్సరాలుగా నివసిస్తున్న శివ అనే వృద్ధుడు మంగళవారం రాత్రి కన్నుమూశారు. శివ అంత్యక్రియలను ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్, అధ్యక్షుడు మధు స్వయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మధు మాట్లాడుతూ ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 683 పైగా అనాథలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఎండీఆర్ ఫౌండేషన్ ఉన్నంత వరకు ఎవరు ఒంటరిగా, అనాథగా చనిపోరాదు అనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఉందని, వృద్ధులు, అనాథలు చివరి శ్వాస విడిచిన తర్వాత కూడా గౌరవంతో వీడ్కోలు ఇవ్వడం మా బాధ్యత అని తెలిపారు. అలాగే ఫౌండేషన్ కార్యకలాపాలకు నిత్యం అండగా నిలుస్తున్న మాదిరి ప్రిథ్వీరాజ్ ఆయన కుటుంబానికి పలువురు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now