కంది విజ్ఞాన్ కాలనీలో నిర్మాణం పనులను పరిశీలించిన డీఎల్ పీఓ

సంగారెడ్డి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది గ్రామ శివారులోని విజ్ఞాన్ కాలనీలో అక్రమంగా హాస్పటల్ నిర్మాణం చేపడుతున్నారని కాలనీవాసుల ఫిర్యాదు మేరకు డీఎల్ పీఓ అనిత అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీరి వెంట పంచాయతీ సెక్రటరీ కవిత, బిల్ కలెక్టర్ మల్లేశం, మాజీ వార్డు సభ్యుడు ఆనంద్ రావు, కాలనీ వాసులు జైపాల్ రెడ్డి, ఉమాకర్, శ్రీనివాస్, రాములు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment