సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలో మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాత అవతారాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు సుధా శ్రీనివాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు.
దోమడుగులో దుర్గాదేవిని దర్శించుకున్న కాట సుధా శ్రీనివాస్ గౌడ్
Published On: September 30, 2025 9:47 pm