ఘనంగా టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

సంగారెడ్డి, అక్టోబర్ 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం టీఎన్జీఎస్ అధ్యక్షుడు జావిద్ అలీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిపారు. సంఘంలోని అందరు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై, వెంకట్ రెడ్డికి పూలమాలలతో సన్మానం చేసి, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జావిద్ అలీ మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి సంఘం అభివృద్ధికి చేసిన సేవలు అపారమని, ఆయన నాయకత్వంలో టీఎన్జీవోస్ కార్యకలాపాలు మరింత బలపడాయని అన్నారు. ఆయన సేవా భావం, క్రమశిక్షణ, సహకార స్వభావం అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై చూపిన ప్రేమ, గౌరవానికి సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆనందంగా ఒకరితో ఒకరు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, విజయ్ కుమార్, హెచ్ డబ్ల్యుఓ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, కృష్ణ, రవికృష్ణ, ప్రమోద్ కుమార్, నాగేశ్వరరావు, మల్లికార్జున్, యాదవ రెడ్డి, కిరణ్, సంతోష్ రెడ్డి, దత్తు, రామప్ప, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment