సంగారెడ్డి/జోగిపేట, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జోగిపేటలో జరిగిన బీజేపీ అలయ్ బలయ్ కార్యక్రమంలో బీజేపీ చౌటకూర్ అభ్యర్థిని అదిష్ఠానం ఫైనల్ చేసింది. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చౌటకూర్ జడ్పీటీసీ అభ్యర్థిగా కుమారి చంటి దేవిక ప్రభును ప్రకటించింది. అనంతరం రామచందర్రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్థానిక సంస్థల్లో పాగా వేయడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని చూస్తున్నది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు స్థానిక ఎన్నికలు తొలి మెట్టుగా భావించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, సంగప్ప, బసవరాజ్ పటేల్, జగదీశ్వర్ పటేల్, రాజేశ్వరరావు దేశ్ పాండే, న్యాయవాది చంటి ప్రభు, సార రాజ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ముకుందం, నాగులపల్లి అంజా గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్ చారి, ప్రభురెడ్డి, సుధాకర్ గౌడ్, జోగినాథ్, సాయి కృష్ణ, ప్రభుగౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చౌటకూర్ జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థిగా చంటి దేవిక పేరు ఖరారు..
Published On: October 5, 2025 8:30 pm