సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని స్వయంగా దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వరస్వామి కటాక్షంతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించానని తెలిపారు. వీరి వెంట శ్రీనివాస్, రాములుగౌడ్, ముద్ద నాగు, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
Published On: September 28, 2025 5:35 pm