సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహారాష్ట్రలోని శ్రీ తుల్జాపూర్ గ్రామంలో స్వయంబుగా వెలిసిన శ్రీ తుల్జా భవాని దేవి నవరాత్రుల సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులుమామిడి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తుల్జాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, దీక్ష సంకల్పము, గోందాలము, స్పర్శ దర్శనము, జోగు వంటి కార్యక్రమాలను ఆలయ పురోహితులు పండిత్ రోహిత్ కదం పరమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ఇక్కడి అమ్మ వారు స్వయంబుశక్తి స్వరూపిణి అని, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల కష్టాలను తీరుస్తూ, కోరిన వారికి కొంగు బంగారమై భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నటు వంటి మహా శక్తి అమ్మవారని అన్నారు. తన మాతృమూర్తి అయిన క్రీ.శే.పులిమామిడి బాగమ్మ జ్ఞాపకార్థం భక్తులందరికి మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని తన సతీమణి పులిమామిడి మమత, కుమార్తె మాధవి, తనయుడు మనోజ్, పీ.ఎం.ఆర్ యువసేన సభ్యులతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలెల్మ రాము, రాణి, చంద్రశేఖర్, అఖిల్, పరమేష్, విగ్నేష్, సంజయ్, సోమ శంకర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తుల్జాపూర్ లో అన్నదానం నిర్వహించిన పులిమామిడి రాజు
Published On: September 28, 2025 6:26 pm