సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న త్రిబుల్ ఆర్, నిమ్జ్, టీజీఐఐసీ భూ సేకరణ ప్రాజెక్టులకు భసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో త్రిబుల్ ఆర్, నిమ్జ్, టీజీఐఐసీ భూసేకరణ పనులపై రెవెన్యూ, నేషనల్ హైవే అథారిటీ, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు భూ సేకరణ వేగంగా పూర్తి చేయడమే కాకుండా తక్షణమే రైతులకు ప్రయోజనం అందేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భూ సేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన అవార్డు ఫైళ్లను వెంటనే ఫైనలైజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. వేరువేరు దశల్లో ఉన్న పనులను సమగ్రంగా సమీక్షించాలన్నారు. పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసి రైతులకు చెల్లించాల్సిన నగదు సకాలంలో అందించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ చర్యల ద్వారా భూసేకరణ పనులు సమర్థవంతంగా పూర్తి అవ్వడమే కాకుండా, రైతులకు తక్షణమే ప్రయోజనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
త్రిబుల్ ఆర్, నిమ్జ్, టీజీఐఐసీ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Updated On: October 7, 2025 8:35 pm