విశ్రాంత ఉద్యోగులందరికీ నగదు రహిత ఆరోగ్య పథకమే ధ్యేయం

సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విశ్రాంత ఉద్యోగుల సంక్షేమమే తమ పరమావధి అని, అందరికీ నగదు రహిత ఆరోగ్య పథకం (కాష్ లెస్ హెల్త్ స్కీం) తక్షణమే అమలులోకి వచ్చేలా కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చిల్వేరి చంద్రశేఖర్ తెలిపారు. అమీన్ పూర్ యూనిట్ 2025–28 సంవత్సరాల నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం అమీన్ పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలోని క్లబ్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేట్ అధ్యక్షులు జి.లింగం అధ్యక్షత వహించారు. ఎన్నికల అధికారి బసవేశ్వర్, పరిశీలకుడు మురలీధర్ సమక్షంలో ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిల్వేరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తోందని, ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా నగదు రహిత ఆరోగ్య పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయించడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళీధర్, జిల్లా నాయకులు బసవేశ్వర్, నవాబ్ రెడ్డి, జగదీశ్వర్, రామచంద్రపురం కోశాధికారి బస్వరాజ్, పట్నం సురేందర్, నాగభూషణం, నాగేశ్వరరావు, రమేష్, చక్రపాణి, నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

*అమీన్ పూర్ యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక* 

అమీన్ పూర్ యూనిట్ నూతన అధ్యక్షుడిగా జే.ప్రభాకర్, కార్యదర్శి వై.రమేష్, కోశాధికారి పి.నాగభూషణం, అసోసియేట్ అధ్యక్షుడు జి.లింగం, ఉపాధ్యక్షులు పి.యాదగిరి, డి.సావిత్రి, సహాయ కార్యదర్శి ఆర్. ప్రభాకర్, ప్రచార కార్యదర్శి కే.నాగరాజు, జిల్లా కౌన్సిలర్ కే.నాగభూషణంలు ఎన్నికయ్యారు.

Join WhatsApp

Join Now