పురపాలక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను శనివారం సంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సంగారెడ్డి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ బద్ధంగా పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు చేస్తూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సమాజంలో ఐక్యత, స్నేహభావం పెంపొందించే వేదికగా నిలుస్తాయని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలతో సంబరాలను జరుపుకున్నారు.

Join WhatsApp

Join Now