సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో, జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయిందని, జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ అన్ని రకాలుగా సమాయత్నం అవుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంభందించి సీనియర్ ఫ్యాకల్టీ, లీగల్ అడ్వైజర్ రాములు ద్వారా జిల్లా పోలీసు అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ రాములు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి, ఏ రకమైన ఉల్లంగాణలు ఏ సెక్షన్ల క్రిందకు వస్తాయని, ఎన్నికల విధులలో ఉన్న అధికారులు చేయవలసిన, చేయకూడని విధుల గురించి వివరిస్తూ.., అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్ధవంతంగా అమలు పరుస్తూ.., ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం మరే ఇతరములు అక్రమ రావాణ జరగకుండా నివారించడం జరుగుతుందని అన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని, ఎవరు కూడా ఇతర పార్టీలను గాని వ్యక్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయరాదని, సోషల్ మీడియాలో పోస్టులు పట్టరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకటరెడ్డి, ప్రభాకర్, సైదా నాయక్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్- ఇన్స్పెక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: October 7, 2025 8:48 pm