బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే మా లక్ష్యం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలంలోని ప్రతి గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డిలు స్పష్టం చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని సీజీఆర్ ట్రస్ట్ క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకుసాగిందని, గ్రామీణ స్థాయిలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలు పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశమని, అందుకోసం ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ నుంచి ఎంపికైన అభ్యర్థిని గెలిపించుకోవడం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని వారు సూచించారు. గెలుపు సాధించేందుకు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఒకే దిశగా కృషి చేస్తే తప్పక విజయాన్ని సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల వల్ల పొందిన లాభాలను గుర్తుంచుకుని మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఆశీర్వాదం అందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ ఐక్యతతోనే విజయం సాధ్యమని, ఎవరికీ అన్యాయం జరగకుండా నాయకత్వం నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment