భారతీయ గ్రంథాలలో రామాయణం ముకుటాయమానం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామాయణ గ్రంధాన్ని రచించి లోకానికి పరిచయం చేసిన మహనీయుడు వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం, భారత సాంస్కృతిక వారసత్వానికి ఆధారం అయిందని పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి రామాయణంలో సకల సద్గుణాలతో సీతారాముల జీవితాన్ని వర్ణించడం జరిగిందన్నారు. సనాతన భారతీయ గ్రంథాల్లో రామాయణం ముకుటాయమానంగా నిలుస్తుందని, మనిషి నైతిక విలువలతో జీవించడానికి దోహదపడుతుందని కొనియాడారు. ఇంత గొప్ప గ్రంధాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు.యువత వాల్మీకి రామాయణంలోని విలువలను ఆచరణలో పెట్టితే సమాజం మరింత అభివృద్ధి దిశగా సాగుతుందని అన్నారు. జిల్లా నలుమూలల వాల్మీకి జయంతిని ప్రజలందరూ నిర్వహించుకోవడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరెంటెండెంట్ విజయలక్ష్మి, బీసీ వెల్ ఫేర్ సహాయ సంక్షేమ అధికారిణి డీఓ అమరజ్యోతి, వివిధ శాఖల అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment