మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): వినాయక నిమర్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… వినాయక శోభా యాత్ర, నిమర్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయాలని, నిమర్జనాలు చేసే చెరువుల వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఎస్ బీ ఇన్స్పెక్షర్ కిరణ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment