నర్సాపూర్, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివంపేట మండలం గోమారంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ,స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహాత్ముడికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
Published On: October 2, 2025 12:01 pm