కుల గణన విధులు ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులకు కేటాయించడాన్ని ఖండిస్తున్నాం: టీటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్

కుల

Headlines 

  • మాచారెడ్డి మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయంపై కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూత్రధారణ
  • ప్రతి బీజేపీ కార్యకర్త 100 క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయాలి
  • 100 ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి చేసిన వారికి క్రియాశీల సభ్యత్వం అందజేత
  • ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలి

*అన్ని రకాల పాఠశాలలలో అధికంగా ఉపాధ్యాయులను గుర్తించి విధులు కేటాయించాలి!!*

*పాఠశాలల పనివేళలకు ఆటంకం కలిగించకూడదు!!*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కుల గణన విధులను కేవలం ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే కేటాయించడాన్ని తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ ఖండించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాఠశాల నిర్వహించి, మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత సెన్సెస్ విధులకు హాజరు కావాలని ఉత్తర్వలు ఇచ్చారని, మధ్యాహ్నం సర్వేకు వెళ్తే గ్రామస్తులు ఎవ్వరు అందుబాటులో ఉండరని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి సర్వే విధులు కేటాయించాలని, ఉదయం పూట సర్వే నిర్వహించి, పాఠశాలలకు ఆటంకం కలగకుండా నిర్వహించే విధంగా కుల గణన ఉత్తర్వులను సవరించి విడుదల చేయాలని ప్రకటనలో విద్యా శాఖాధికారులను కోరారు.

Join WhatsApp

Join Now