లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే – పనుల్లో జాప్యం పై ఆగ్రహం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 4, (ప్రశ్నాయుధం):

గత నెలలో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం నిర్మాణంలో ఉన్న డైవర్షన్ రోడ్-కం-బ్రిడ్జి పనులను ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ పనుల కోసం కోటి రూపాయల నిధులను గతంలోనే మంజూరు చేసిన ఎమ్మెల్యే, పర్యటనలో భాగంగా స్థానిక లింగంపేట మండల నాయకులు, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

పనులలో జరుగుతున్న జాప్యం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మదన్మోహన్, ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనులను సత్వరంగా పూర్తి చేసి, ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment