వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఆత్మీయ అలయ్ బలయ్ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం పోతిరెడ్డిపల్లి చౌరస్తా విద్యానగర్ కాలనీలోని రోడ్ నెంబరు 3లో గల కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ స్కోర్ చైర్మన్ సంగమేశ్వర్, ప్రముఖ న్యాయవాది, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఆధ్యాత్మిక వేత్త శివ శ్రీ వీరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగమేశ్వర్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు సంఘం తరఫున చేపట్టడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు. సంఘం అంటే అందరు కలిసి మెలిసి పోవడం అని చెప్పారు. అనంతరం వీరారెడ్డి మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు ఎవరైతే వ్యక్తులు లింగ దారుణ చేసుకుంటారో వాళ్లందరూ లింగాయతులని అని అప్పుడే చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రిటైర్డ్ టీచర్ మాణయ్య వ్యవహరించారు. అనంతరం నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన విద్యార్థిని, విద్యార్థులకు సన్మానం చేశారు. తర్వాత వచ్చిన అతిథులులందరూ ఆత్మీయ ఆలింగణం చేసుకొని అందరూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీ మెంబర్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్, మేడిపల్లి మాజీ సర్పంచ్ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శివ చరణ్, సంగారెడ్డి జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు ధనంజయ, అధ్యక్షుడు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, కోశాధికారి గోవు రాజు, ఉపకోశాధికారి శివకుమార్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ స్వామి, సంగిశెట్టి భరతప్ప, ముఖ్య సలహాదారులు శివకుమార్, అడ్వకేట్ సంగమేశ్వర, అడ్వకేట్ సలహాదారులు పట్లోళ్ల చంద్రశేఖర్, శివశంకర్, కప్పాటి శ్రీనివాస్, కార్యదర్శులు చంద్రశేఖర్, శివకుమార్, జగదీశ్వర్, గౌలీశ్వర్, ప్రభులింగం, ప్రభు, సంగమేశ్వర్, ఈశ్వరప్ప, రవీందర్, మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి వినీత, ఉపాధ్యక్షురాలు వీరమణి, నిర్మల, అనిత, శ్రీదేవి, రాణి, మాజీ కౌన్సిలర్ రామప్ప, వీర శైవ సమాజం అధ్యక్షుడు ఇప్పపల్లి నరసింహులు, ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్, కోశాధికారి సంతోష్ పాటిల్, యువజన అధ్యక్షుడు బుగ్గనగారి మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి నవీన్, మహిళా సంఘం అధ్యక్షుడు అరుణ, మాజీ అధ్యక్షుడు మధు శేఖర్, చంద్రకాంత్, రవి శంకర్, చెల్మెడ బసవరాజ్, శ్రీశైలం, అశోక్, వీర మల్లేష్, మహాదేవ్ గారి సదాశివుడు, మాటూరు మనోహర్, వీరన్న, హనుమప్ప, వైద్యనాథ్, శంకర్, మాజీ పారా మిలటరీ అధ్యక్షుడు సంగమేశ్వర్, సదాశివపేట మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, రాయికోడ్ అధ్యక్షుడు పవన్ కుమార్, ఝరాసంగం అధ్యక్షుడు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment