సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానీ చంద్ర ఆదేశాల ప్రకారం మంగళవారం శిశు గృహం, సఖి కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలకు అన్ని చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు వారి బాగోగులను పరిశీలించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులకు న్యాయ పరమైన అంశాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఎవరైనా న్యాయ సహాయం కోరినచో సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంను సంప్రదించాలని తెలిపారు.
శిశు గృహ, సఖి కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీ
Published On: October 7, 2025 6:54 pm