సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం సత్యం, నీతి, ధర్మం, కర్తవ్యబోధలు సమాజంలో సత్యం, న్యాయం, సమానత్వం స్థాపనకు ప్రేరణగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను పాటిస్తూ.. నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్స్ రమేష్, కిరణ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావ్, ఆర్ఐ.లు రామా రావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, వివిధ సెక్షన్లకు చెందిన డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి జయంతి
Published On: October 7, 2025 2:12 pm