బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్న న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్

సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బతుకమ్మ పండుగ సంబరాలలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ అనేది ధర్మంగాంధ రాజు అనే దంపతులకు వందమంది పుత్రులు జన్మించి వారు మరణిస్తూ ఉండడం సంభవించిందని అన్నారు. ఈ తరుణంలో ఆ మహారాజు ఆదిపరాశక్తి అమ్మవారిని వేడుకుంటూ ఉంటే ఆ వందమంది పుత్ర సంతానం తర్వాత ఆడపడుచు జన్మిస్తుందని, ఈ యొక్క ఆడపడుచు సురక్షితంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆ యొక్క మహారాజు మునీశ్వరులను అందరినీ పిలిచి ఆశీర్వదించమని కోరగా.. మునీశ్వరులు అందరూ ఆ ఆడపడుచుని నువ్వు నిండు నూరేళ్లు బతుకమ్మ అని దీవించగా. ఆ రోజు నుండి ఆమె యొక్క నామకరణ దినోత్సవంను బతుకమ్మ పండుగగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మున్సిపల్ సిబ్బందికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now